Jaishankar : గాజాలో కాల్పుల విరమణకు భారత్ మద్దతు.. విదేశాంగ మంత్రి జైశంకర్

by vinod kumar |
Jaishankar : గాజాలో కాల్పుల విరమణకు భారత్ మద్దతు.. విదేశాంగ మంత్రి జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో ముందస్తు కాల్పుల విరమణకు భారత్ మద్దతిస్తుందని విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) నొక్కి చెప్పారు. సౌదీ కౌంటర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌తో బుధవారం జైశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) యుద్ధంపై చర్చించారు. తీవ్రవాద చర్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ గతేడాది అక్టోబర్ 7 ఉగ్రదాడులకు ప్రతిస్పందనగా అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పశ్చిమాసియా (Middle East)లో పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. పాలస్తీనా సమస్య పరిష్కారానికి భారత్ అండగా నిలిచిందని గుర్తు చేశారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించినప్పుడు కూడా ఉద్రిక్తతలు తగ్గించాలని భారత్ సూచించినట్టు గుర్తు చేశారు. బందీలందరినీ విడుదల చేయాలని, మానవతా సహాయాన్ని పునఃప్రారంభించాలని పిలుపునిచ్చారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, భద్రత, ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపైనా ఇరువురు చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed