- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక.. ఏర్పాట్లను సమీక్షించిన సీఎస్ శాంతికుమారి
దిశ, తెలంగాణ బ్యూరో: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. 21న సాయంత్రం హాకీంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న రాష్ట్రపతి, అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరవుతారు. 22నహైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో లోక్ మంతన్-2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రపతి రెండు రోజుల పాటు నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేందుకు మాన్యువల్ ప్రకారం.. తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
బ్లూబుక్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆమె ఆదేశించారు. పోలీసు శాఖ తగిన భద్రతా ఏర్పాట్లు, సరైన ట్రాఫిక్, బందోబస్తు ప్రణాళికను రూపొందించాలని సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ సహాయక సిబ్బందితో పాటు అర్హులైన వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రపతి బస చేసే ప్రదేశం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం, డీజీపీ జితేందర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్‌రావు, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.