Bhujanga Rao: మధ్యంతర బెయిల్ పొడిగింపు తిరస్కరణ.. నాంపల్లి కోర్టులో భుజంగ‌రావు సరెండర్

by Shiva |   ( Updated:2024-11-14 11:05:06.0  )
Bhujanga Rao:  మధ్యంతర బెయిల్ పొడిగింపు తిరస్కరణ.. నాంపల్లి కోర్టులో భుజంగ‌రావు సరెండర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో కీలక నిందితుడిగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు (Bhjanga Rao) బెయిల్‌ను రద్దు చేస్తూ బుధవారం హైకోర్టు (High Court) ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర బెయిల్ పొడిగించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం అందుకు నిరాకరించింది. అదేవిధంగా గురువారం సాయంత్రం 4 గంటల లోపు జైలుకు వెళ్లాలని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ భుజంగరావు నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్లి లొంగిపోయారు. బీఆర్ఎస్ (BRS) పాలనలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం కేసులో విచారణ కొనసాగుతోంది. తాజాగా, బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే (Former MLA's)లకు కూడా కేసుతో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు.

కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు (Bhujanga Rao)ను మార్చి 23న పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, అనారోగ్య కారణాలతో ఆగస్టు 19న ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం బెయిల్ గడవును పొడిగిస్తూ వచ్చింది. అనంతరం భుజంగ‌రావు తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని పిటిషనల్ దాఖలు చేయగా కోర్టు తోసిపుచ్చింది.

Advertisement

Next Story

Most Viewed