- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
గ్రంథాలయాలే ఆధునిక దేవాలయాలు
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : గ్రంథాలయాలే ఆధునిక దేవాలయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచంలో జ్ఞానమే అధికారమని, అది గ్రంథాలయాలతోనే సాధ్యమని కొనియాడారు.
గ్రంథాలయాలను ఉపయోగించుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని సూచించారు. గ్రంథాలయాల ద్వారానే నైతిక విలువలతో కూడిన భావి భారత పౌరులు తయారవుతారని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తానని, అందుకు తన వంతు కృషి చేస్తానని చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
అనంతరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, నాయకులు సంగీతం శ్రీనివాస్, ఎల్లె లక్ష్మీనారాయణ, గ్రంథాలయ పాలకులు శంకరయ్య, మల్లయ్య, శ్రీనివాస్, మాధవి, పాఠకులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.