- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP News : పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్
దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ శాంతికి, భారతదేశ ఆధ్యాత్మిక విశిష్టత ప్రాచుర్యానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్(Art Of Living) వ్యవస్థాపకులు రవిశంకర్(Ravi Shankar) గొప్ప మార్గం చూపించారని, ఆ మార్గంలో మనస్ఫూర్తిగా ముందుకెళ్తామని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) పేర్కొన్నారు. ఆధునిక యోగ ప్రక్రియల్లో సుదర్శన క్రియ ఎంతో విశిష్టమైనదని... అలాంటి యోగ ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి రవిశంకర్ అని.. ఉత్సాహం, జ్ఞాపకశక్తి, ఆలోచనశక్తిని పెంచే ప్రక్రియగా సుదర్శన క్రియకు గుర్తింపు ఉందని, అలాంటి ప్రక్రియను పరోక్షంగా నాకు ఉపదేశించింది ఆయనే అని అన్నారు. రవి శంకర్ మాట్లాడుతూ “జీవితంలో విజయం సాధించాలంటే ఏ వ్యక్తికైనా భక్తి, ముక్తి, యుక్తి, శక్తి అనే నాలుగు నైపుణ్యాలు చాలా అవసరం. ఆత్మ బలంతో ధైర్యంగా ముందుకు వెళ్తేనే విజయం వరిస్తుంది. పరిపాలనలో రాజు ఎప్పుడూ సంతృప్తి చెందకూడదు. సంతృప్తి చెందితే ప్రజలకు మేలు జరగడం ఆగిపోతుంది” పేర్కొన్నారు.