- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bangladesh: బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదం తీసేయాలి.. అటార్నీ జనరల్ అసదుజ్జమాన్
దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ అటార్నీ జనరల్ మహ్మద్ అసదుజ్జమాన్ (Md Asaduzzaman) దేశ రాజ్యాంగాన్ని సవరించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం నుంచి సెక్యులర్ (Secular) అనే పదాన్ని తొలగించాలని తెలిపారు. దేశంలో 90 శాతం మంది ప్రజలు ఓకే మతానికి చెందిన వారు ఉన్నారని కాబట్టి ఈ పదం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు(Bangladesh supreme court) లో తాజాగా వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని 15వ సవరణ చట్టబద్ధతపై కోర్టు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఫరా మహబూబ్, దేబాశిష్ రాయ్ చౌదరి బెంచ్ ఎదుట ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రాజ్యాంగంలో ఆర్టికల్ 2A ప్రకారం అన్ని మతాలకు సమాన హక్కులు ఉన్నాయి. కానీ ఆర్టికల్ 9 బెంగాలీ జాతీయవాదం గురించి వివరిస్తుంది. ఇది ఆర్టికల్ 2Aకు విరుద్ధమైనది. ఆధునిక ప్రజాస్వామ్య సూత్రాల దృష్యా ఇది సరికాదు’ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని 8వ అధికరణకు సంబంధించి, బంగ్లాదేశ్‌లో సోషలిజం, సెక్యులరిజం వాస్తవికతతో సరిపోలడం లేదని తెలిపారు.
అంతేగాక బంగబంధు షేక్ ముజిబర్ రెహమాన్ (Shake muzibur Rajaman)ను జాతిపితగా పేర్కొనే నిబంధనను కూడా తొలగించాలని సూచించారు. షేక్ ముజీబర్ సహకారాన్ని గౌరవించడం చాలా ముఖ్యం కానీ చట్టం ద్వారా దానిని అమలు చేయడం విభజనను సృష్టిస్తుందని హెచ్చరించారు. 15వ సవరణ రాజ్యాంగబద్ధతను కోర్టు పరిశీలించాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 6, 7 (ఎ), 7 (బీ)లకు సంబంధించి కూడా అటార్నీ జనరల్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నిబంధనలు ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజాభిప్రాయసేకరణను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని పునరుద్ధరించేందుకు ఇది ఎంతో అవసరమని నొక్కి చెప్పారు.