రఘునందన్ రావుపై పరువు నష్టం దావా.. ఐఆర్‌బీ లీగల్ నోటీసులు

by Seetharam |
రఘునందన్ రావుపై పరువు నష్టం దావా.. ఐఆర్‌బీ లీగల్ నోటీసులు
X

దిశ,వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే రఘునందన్ రావుపై ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ రూ. 1,000 కోట్ల పరువునష్టం దావా వేసింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు పంపింది.

నోటీసుల్లో ఐఆర్‌బీ పేర్కొన్న వివరాల ప్రకారం… ఈ నెల 25న రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఉద్యమం చేసే వారిని ఐఆర్‌బీ చంపేస్తుందని అన్నారని తెలిపింది. గతంలో జరిగిన ఆర్టీఏ కార్యకర్త హత్యతో ఐఆర్‌బీకి ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని పూణే సెషన్స్ కోర్టు, ముంబయి హైకోర్టు కూడా స్పష్టం చేశాయని పేర్కొంది. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా తమ ప్రతిష్ఠను దెబ్బతీసేలా రఘునందన్ రావు మాట్లాడారని విమర్శించింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లీజుకు సంబంధించి తమపై నిరాధారమైన ఆరోపణలు చేశారని తెలిపింది.

రాజకీయ ప్రయోజనాల కోసం తమపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపింది. తమకు రఘునందన్ రావు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరింది. క్షమాపణలు చెప్పకపోతే రూ. 1,000 కోట్లు పరువు నష్టం కింద చెల్లించాలని లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

రఘునందన్‌రావు మాట్లాడుతూ.. తాను లాయర్‌ని అని, ఐఆర్‌బీ సంస్థ నోటీసులకు భయపడనని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఐఆర్‌బీ ఇచ్చిన నోటీసులోని ప్రతి అక్షరానికి సమాధానం చెప్తానని రఘునందన్ రావు అన్నారు. భయపడటానిక ఇది మహారాష్ట్రకాదు అని రఘునందన్‌రావు ఘాటుగా సమాధానం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed