బీజేపీ నేతపై పరువు నష్టం దావా.. దీపాదాస్ మున్షీకి రేణుకా చౌదర్ మద్దతు

by Prasad Jukanti |
బీజేపీ నేతపై పరువు నష్టం దావా.. దీపాదాస్ మున్షీకి రేణుకా చౌదర్ మద్దతు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ నాంపల్లి కోర్టులో రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు శుక్రవారం కోర్టులో 40 నిమిషాల పాటు దీపాదాస్ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేశారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా బెంజ్ కార్లు, డబ్బులు తీసుకుని దీపాదాస్ మున్షీ రాష్ట్ర నేతలకు ఎంపీ టికెట్లు వచ్చేలా చేశారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గతంలో ఆరోపించారు. ఆమె పార్టీలో తన పదవిని అడ్డు పెడ్డుకుని క్విడ్ ప్రోకో కు పాల్పడినట్లు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను అప్పట్లోనే ఖండించిన దీపాదాస్.. ఈ ఆరోపణలను నిరూపించాలని ప్రభాకర్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ రావడంతో సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో దీపాదాస్ తాజాగా కోర్టుకు హాజరయ్యారు. దీపాదాస్ పై వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి స్పందించారు. ఎవరైనా మహిళ ఎదుగుతుంటే వారిపై నిందలు వేసే పురుషులు పురుషులు ఉంటారని మండిపడ్డారు. ఈ విషయంలో దీపాదాస్ చేస్తున్న పోరాటానికి దాను గర్విస్తున్నానని ఆమెకు తన మద్దతు వందకు 300 శాతం ఉంటుందని చెప్పారు.

Advertisement

Next Story