TG:ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతున్న అడ్మిషన్లు.. సర్కార్ కీలక నిర్ణయం

by Jakkula Mamatha |
TG:ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతున్న అడ్మిషన్లు.. సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వ విద్యాసంస్థలను డెవలప్‌మెంట్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి ఏటా పాఠశాలల పునః ప్రారంభానికి ముందు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుండడం విదితమే. కానీ గవర్నమెంట్ పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గుతున్నాయి.

అయితే ప్రస్తుతం ప్రభుత్వ స్కూల్లో(Govt School) మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. తెలుగు(Telugu)తో పాటు ఇంగ్లీష్‌(English) మీడియంలోనూ బోధన జరుగుతోంది. అయినా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) నిర్ణయించింది.

ఈ తరుణంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో అందిస్తున్న సౌకర్యాలు, వస్తున్న ఫలితాల గురించి ప్రజలకు తెలిసేలా వివరించనుంది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపట్టనుంది. దీనికోసం ఫేస్‌బుక్, ట్విట్టర్(X), WHATSAPP వంటి సోషల్ మీడియా వేదికల్లో స్పెషల్ గ్రూపులను క్రియేట్ చేయనుంది. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా, మండల, స్కూల్ లెవెల్​లోనూ వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారని సమాచారం.

Next Story