- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

దిశ, మునుగోడు; మహిళ సంక్షేమానికి కాంగ్రేస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన మండలంలో 86 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి పేద ప్రజలకు అండగా ఉంటదన్నారు.
ఈ నెల 30 తేదిన రాష్ట్రంలో ఉన్న ప్రజా ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్ నరేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు, చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వాయి చెన్న రెడ్డి, మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ , మాజీ సర్పంచులు జాల వెంకన్న యాదవ్, మిరియాల వెంకన్న, మాధగోని రాజేష్ గౌడ్, నాయకులు పాల్వాయి జితేందర్ రెడ్డి , తాటికొండ సైదులు, గోపగోని పాపయ్య ,నడింపల్లి యాదగిరి, ఆరేళ్ల సైదులు, సాగర్ల లింగస్వామి, పందుల భాస్కర్, జిట్టగోని యాదయ్య, నకరికంటి యాదయ్య, జక్కల శీను, దోటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.