- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగా డీఎస్సీ ప్రకటించాల్సిందే: డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల డిమాండ్
దిశ, డైనమిక్ బ్యూరో: వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించాల్సిందేనని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో టీఆర్టీ అభ్యర్థులు లక్డీకపూల్‌లోని విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వందలాది మంది అభ్యర్థులు ముట్టడికి యత్నించే క్రమంలో బషీర్బాగ్‌లోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ నుంచి అసెంబ్లీ వైపు అభ్యర్థులు దూసుకెళ్లారు. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో అభ్యర్థుల ఆందోళనతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దీంతో వెంటనే పోలీసులు వారిని అడ్డకుని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. గత ఏడు సంవత్సరాలుగా ఐదు లక్షల మంది అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని, కేవలం 5 వేల పోస్టులు విద్యాశాఖ విడుదల చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చిన విధంగా 13,089 ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్ష నిర్వహించవద్దని, ఆఫ్ లైన్‌లోనే పరీక్ష నిర్వహించాలని, పరీక్షకు నాలుగు నెలల సమయాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.