- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నెక్ట్ టార్గెట్ పొలిటిషియన్సే’.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై DCP విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని, ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతలను సైతం విచారిస్తామని తెలిపారు. ప్రస్తుతం పొలిటిషియన్స్ వ్యవహారంపై సాక్ష్యాలు సేకరిస్తున్నామని, ఎవిడెన్స్ సేకరణ తర్వాత ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తామని తెలిపారు. కేసులో ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని, కోర్టు దానిని పరిగణలోకి తీసుకుందని తెలిపారు. ఈ కేసులో కీలక నిందితులు ఇద్దరు విదేశాల్లో ఉన్నారని వాళ్లను ఇండియాకు రప్పించే ప్రయత్నం జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు.
కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. మిగిలిన నలుగురు జ్యూడిషియల్ రిమాండ్‌లో భాగంగా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కేసు విచారణపై స్పీడ్ పెంచామని పోలీసులు తెలపడంతో ఎవరి పేర్లు బయటపడుతాయోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.