లైంగిక వేధింపులకు పాల్పడితే ఖబడ్ధార్.. డీసీపీ నర్మద

by Vinod kumar |
లైంగిక వేధింపులకు పాల్పడితే ఖబడ్ధార్.. డీసీపీ నర్మద
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: పనిచేసే చోట మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు డీసీపీ నర్మద హెచ్చరించారు. దోషులుగా తేలిన ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తి ఉండదన్నారు. పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి రక్షణకై తీసుకుంటున్న చర్యలపై రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్​ఉమెన్స్​ఫోరం సంయుక్త కార్యదర్శి లతారామ్​ఆధ్వర్యంలో శుక్రవారం ఈ అంశంపై ఔట్​సోర్సింగ్ ఉద్యోగినులకు ఒకరోజు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులకు ఉండే హక్కుల గురించి తెలియచేశారు. మాటలు, చేతల ద్వారా మరే ఇతర మార్గాల్లో అయినా మహిళా ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు పాల్పడితే చట్టంలో కఠిన చర్యలు ఉన్నట్టు డీసీపీ నర్మద చెప్పారు.

వేధింకే వారిపై ఎలా ఫిర్యాదు చేయవచ్చన్నది వివరించారు. వేధింపులు జరిగిన మూడునెలల లోపు వరకు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. బాధితురాళ్లు స్వయంగా ఫిర్యాదు చేయలేని పరిస్థితుల్లో ఉంటే కుటుంబసభ్యుల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో భూమిక కలెక్టీవ్​స్థాపకురాలు కె. సత్యవతి పాల్గొన్నారు. సీసీఎంబీ, సీఐపీఈటీ, ఐఐసీటీ, ఐఏసీఎల్, బీపీసీఎల్, రామోజీ గ్రూప్​నకు చెందిన ప్రియా ఫుడ్స్, కళాంజలి, ఇన్ఫోసిస్, జెన్​ప్యాక్ట్, ఆమెజాన్​తదితర సంస్థలకు చెందిన దాదాపు వెయ్యిమంది ఈ అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story