తెలంగాణ కేబినెట్ భేటీ డేట్ ఫిక్స్.. రేవంత్ సర్కార్ నిర్ణయాలపై తీవ్ర ఉత్కంఠ

by Satheesh |   ( Updated:2024-06-19 13:33:35.0  )
తెలంగాణ కేబినెట్ భేటీ డేట్ ఫిక్స్.. రేవంత్ సర్కార్ నిర్ణయాలపై తీవ్ర ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 21వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు మంత్రి మండలి సమావేశం కానుంది. ఆగస్ట్ 15 లోగా పూర్తి చేస్తామని చెప్పిన రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా స్కీమ్, పంటల బీమా పథకం విధివిధానాల రూపకల్పన అజెండాగా ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీపైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్ రూప కల్పనపై ఇప్పటికే యాక్షన్ మొదలెట్టిన రేవంత్ సర్కార్.. జూలై చివరి వారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని యోచిస్తోన్నట్లు సమాచారం.

Advertisement

Next Story