తెలంగాణ చారిత్రక ఆనవాళ్లను చెడిపేసే పనిలో CM రేవంత్: దాసోజు శ్రవణ్ ఫైర్

by Satheesh |   ( Updated:2024-05-29 13:10:34.0  )
తెలంగాణ చారిత్రక ఆనవాళ్లను చెడిపేసే పనిలో CM రేవంత్: దాసోజు శ్రవణ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అధికారిక చిహ్నాం మార్పు ఇష్యూ స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే అధికారిక చిహ్నాం మార్పు టాపిక్‌‌పై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ రియాక్ట్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ చార్రితక ఆనవాళ్లను తుడిచే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన ప్రతీసారి ప్రభుత్వ గుర్తులు, పేర్లు మార్చడం సరికాదని హితవు పలికారు. ఇప్పుడు చిహ్నాం మారుస్తోన్న రేవంత్ రెడ్డి సీఎం పదవి నుండి దిగిపోవాల్సి వస్తే కొత్త ముఖ్యమంత్రి మరో కొత్త లోగో తెస్తారా అని ప్రశ్నించారు. ఒక వేళ రాష్ట్ర అధికారిక చిహ్నాం మార్చాల్సి వస్తే ప్రజలను ఒప్పించి.. మెప్పించాలని సూచించారు. అన్ని వర్గాల సంప్రదింపులతో పాటు అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed