CV Anand IPS: ప్రణాళికలు మార్చి ట్రాప్ చేసి పట్టుకున్నాం.. ఏసీబీ డీజీ ఆసక్తికర పోస్ట్

by Ramesh Goud |
CV Anand IPS: ప్రణాళికలు మార్చి ట్రాప్ చేసి పట్టుకున్నాం.. ఏసీబీ డీజీ ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వారిని ట్రాప్ చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు మార్పు చేశామని, అలాంటి వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న అనిశా నుంచి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ తెలిపారు. లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. లంచం తీసుకునే వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అవినీతి నిరోధక శాఖ అధికారుల నుండి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

ఇక నిన్న రాత్రి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు చెందిన జాయింట్ కలెక్టర్ ఎమ్‌వి భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి రూ. 8 లక్షలు లంచం తీసుకుంటూ అ.ని.శా అధికారులకు చిక్కారని తెలిపారు. 14 గుంటల భూమిని ధరణి పోర్టల్‌లో నిషేధిత భూముల జాబితా నుండి తొలగించుటకు గాను సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారని, తదుపరి ఆ మొత్తాన్ని జాయింట్ కలెక్టర్‌కి అందచేశారని అన్నారు. ఫిర్యాదుదారుని నుండి నగర శివార్లలో డబ్బు తీసుకోవటం, ఆ పై ఓఆర్ఆర్ దగ్గర జాయింట్ కలెక్టర్‌కి అందేలా జాగ్రత్త తీసుకున్నప్పటికీ, ఏసీబీ టీమ్ రాత్రంతా ఎంతో చాకచక్యంగా అప్పటికప్పుడు ప్రణాళికలు మార్పు చేసుకుంటూ ఇద్దరిని ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని సీవీ ఆనంద్ తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed