Swiggy: చికెన్ ఫ్రై లో పురుగు.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా ?

by Rani Yarlagadda |
Swiggy: చికెన్ ఫ్రై లో పురుగు.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా ?
X

దిశ, వెబ్ డెస్క్: ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు, బయటి ఫుడ్ ఎక్కువగా తినేవారికి ఇది షాకింగ్ న్యూసే. ఆదివారం ఉదయం సోమాజిగూడ యశోద ఆస్పత్రి ఎదురుగా ఉన్న స్వాతి టిఫిన్స్ (Swathi Tiffins)లో దోసె తింటున్న వ్యక్తికి బొద్దింక కనిపించిన ఘటన కలకలం రేపింది. ఇదేంటని యాజమాన్యాన్ని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం గమనార్హం. మధ్యాహ్నమయ్యేసరికి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన మరో వ్యక్తికి చికెన్ ఫ్రై లో పురుగు ఫ్రీ గా వచ్చింది.

అనిరుధ్ అనే వ్యక్తి హైటెక్ సిటీ (Hitech City) సైబర్ టవర్స్ (Cyber Towers)కు ఎదురుగా ఉన్న ఓ హోటల్ లో స్విగ్గీ (Swiggy) నుంచి చికెన్ ఫ్రై, చికెన్ నూడిల్స్, మెజెస్టిక్స్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ రావడమే ఆలస్యం.. వేడివేడిగా లాగించేద్దామని ఆత్రంగా పార్శి్ల్ ఓపెన్ చేసి చికెన్ ఫ్రె ప్లేట్ లో వేసుకున్నాడు. అలా ఒక పీస్ నోట్లో పెట్టుకున్నాడో లేదో.. చికెన్ తో పాటే రోస్ట్ అయిన పురుగు దర్శనమిచ్చింది. ఇక మనోడి ఫ్యూజులు ఎగిరిపోయాయి. వెంటనే జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు.

అసలు అది ఏ కూరగాయల నుంచో వచ్చిన పురుగా ? లేక కుళ్లిపోయిన చికెన్ తో ఫ్రై చేశారా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నా.. ఫుడ్ లవర్స్ మాత్రం బయటి ఫుడ్ తినడం మానడం లేదు. ఇతర ఊర్ల నుంచి సిటీకి ఉద్యోగం కోసం, కోర్సుల కోసం వచ్చిన యువత.. హాస్టల్ ఫుడ్ తినలేక వీకెండ్స్ బయట తింటున్నారు. ఇలాంటివి చూస్తే.. ఇక బయట తినాలన్నా భయపడాల్సిందే.

ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలో ఎప్పటికప్పుడు హోటల్స్ లో తనిఖీలు చేసి.. సేఫ్టీ ప్రికాషన్స్ పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అయినా నిర్వాహకుల్లో మార్పు లేదు. వినియోగదారులు ఎలా పోతే మాకెందుకు.. మా బిజినెస్ లాస్ లేకుండా జరిగిందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లుంది వారి తీరు. ఇకనైనా మీరు జర బయటి ఫుడ్ తినడం బంద్ చేయండి. లేదంటే ఆస్పత్రుల బిల్లు కట్టేందుకు అమ్ముకోడానికి ఆస్తులు కూడా ఉండవు.

Advertisement

Next Story