CS Shanti Kumari : సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎస్ శాంతి కుమారి

by Y. Venkata Narasimha Reddy |
CS Shanti Kumari : సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎస్ శాంతి కుమారి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జన్మదినం(Birthday)సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకుని కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పలు పార్టీల జాతీయ, రాష్ట్ర నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS Shanti Kumari ) సైతం సీఎం రేవంత్ రెడ్డికి భారీ పుష్ప గుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అటు నుంచి మూసీ పునరుజ్జీవన పాదయాత్రకు బయలు దేరారు. యాదగిరిగుట్ట హెలిప్యాడ్, ఆలయం, మూసీ పాదయాత్రల వద్ధ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు, అధికారులు, పార్టీ ప్రజాప్రతినిధులు భారీ ఘన స్వాగతం పలికారు.

Advertisement

Next Story