యాదాద్రిలో భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 3 గంటలు

by Ramesh N |
యాదాద్రిలో భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 3 గంటలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రిలో భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజామున నుంచే క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలోని పరిసర ప్రాంతాల్లో లడ్డు కౌంటర్లు, కల్యాణ కట్ట లాంటి ప్రదేశాల్లో భక్తులతో కిక్కిరిసిపోయింది.

స్వామి వారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక ప్రవేశ 150 రూపాయల దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

Next Story