Kavitha: కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి... ఒక వేగుచుక్క: కవిత

by Prasad Jukanti |
Kavitha:  కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి... ఒక వేగుచుక్క: కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) విమర్శించారు. కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని, పీకేయడానికి కేసీఆర్ (KCR) మొక్క కాదని ఓ వేగు చుక్క అన్నారు. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అని చెప్పారు. సోమవారం హైదరాబాద్ లో కవిత నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో నిధులు వరదలయ్యి పారేవని ఇప్పుడు రాష్ట్రంలో తిట్ల వరద పారుతుందని సెటైర్ వేశారు.

కవితకు పద్మశాలి సంఘం ధన్యవాదాలు:

ఎమ్మెల్సీ కవితను అఖిల భారత పద్మశాలి సంఘం (All India Padmasali Association) నాయకులు కలిశారు. కులగణనపై ఇటీవల బీసీ డెడికేటెడ్ కమిషన్ కు కవిత నివేదిక అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వారితో మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో కూడా లేని చేనేతపై పన్నును ప్రధాని మోదీ జీఎస్టీ విధించడం దౌర్భాగ్యం అని కవిత అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ తరఫున చేనేతపై జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం శోచనీయమన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రియింబర్స్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed