- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Crazy Reels: గూడ్స్ రైలుపై రీల్స్.. హైటెన్షన్ వైర్లు తగిలి 70 శాతం కాలిన యువకుడు
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ రోజుల్లో యువత సోషల్ మీడియా ఫేమస్ అవ్వడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రమాదపుటంచుల వరకు వెళుతున్నారు. రీల్స్ పిచ్చిలో పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే వరంగల్ జిల్లా కాజీపేటలో జరిగింది. ఓ యువకుడు రీల్స్ చేస్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి ప్రమాదానికి గురయ్యాడు. రాజు అనే యువకుడు యూట్యూబ్ లో షార్ట్స్ పేరుతో పొట్టి వీడయోలు పోస్ట్ చేస్తుంటాడు. ఈ నేపధ్యంలోనే రీల్స్ చేసేందుకు కడిపికొండ రాంనగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. ట్రాక్ పై ఆగి ఉన్న గూడ్స్ రైలు ఎక్కి రీల్స్ లో నటించేందుకు ప్రయత్నించాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటుండగా.. పక్కనే ఉన్న హైటెన్షన్ వైర్లు తగిలి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతని స్నేహితులు వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించారు. అనంతరం అతన్ని అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. యువకుడిని పరీక్షించిన వైద్యులు శరీరం దాదాపు 70 శాతం మేర కాలిపోయిందని, చికిత్స ప్రారంభించామని చెప్పినట్లు తెలిసింది.