మునుగోడులో CPM లక్ష్యం అదే.. తమ్మినేని వీరభద్రం క్లారిటీ

by GSrikanth |
మునుగోడులో CPM లక్ష్యం అదే.. తమ్మినేని వీరభద్రం క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సీపీఎం యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో మతోన్మాద బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మెల్లగా బీజేపీ తన నిజస్వరూపాన్ని బయటపెడుతూ.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే దేశంలోని దాదాపు ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలు, ప్రభుత్వ రంగసంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతే సంపదంతా వారి వద్దే కేంద్రీకృతమవుతుందన్నారు. ఇలాంటి దుర్మార్గమైన విధానాలను అనుసరిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు, పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సహా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story