CPIM నేత బీవీ రాఘవులు సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
CPIM నేత బీవీ రాఘవులు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వంపై కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు(CPIM) నేత బీవీ రాఘవులు(BV Raghavulu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదని అన్నారు. అదానీ(Adani) ముడుపుల కుంభకోణం, మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం నోరు విప్పడం లేదని తెలిపారు. ఈ పరిణామాలు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం అనుమానం కలుగుతోందని అన్నారు. అదానీని రక్షించేందుకు మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. తక్షణమే అదానీ ముడుపుల అంశంపై జేపీసీ(JPC) వేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాక కూడా 55 లక్షల ఓట్లు పోలయ్యాయని అన్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

అదానీ నుంచి వైసీపీ(YCP) అధినేత జగన్‌(Jagan)కు లంచాలు అందాయనే ఆరోపణలు వస్తున్నా.. జగన్‌ను ఈడీ(ED) ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ఈ లంచాల వ్యవహారం అతిపెద్ద కుంభకోణమని చెప్పారు. అదానీతో కుమ్మక్కైన వారిని ఎవరినీ వదలకూడదని అన్నారు. ప్రజలపై భారం మోపేలా చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. తెలంగాణలో రైతుల పోరాటంతోనే ఫార్మాసిటీ, ఇథనాల్ ఫ్యాక్టరీలపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అన్నారు. కమ్యూనిస్టు పార్టీగా తాము ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed