CPIM: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

by Gantepaka Srikanth |
CPIM: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్ట్‌ల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) కార్యదర్శి జాన్ వెస్లీ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. చాలీచాలని వేతనాలతో జీవితాలను అనుభవిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోలన్నారు. అనేక ఉద్యమాల్లో పాత్రికేయుల పాత్ర మరువలేనిదని, గత పదేండ్లుగా వివిధ కారణాలతో దాదాపు 500 మందికి పైగా జర్నలిస్టులు మరణించారని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో సంగారెడ్డిలో జరిగిన సీపీఐ(ఎం) తెలంగాణ 4వ రాష్ట్ర మహాసభల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక తీర్మానం ఆమోదించామని వారు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నామన్నారు. వీటిలో ప్రధానంగా ఇండ్లస్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, మహిళా జర్నలిస్ట్‌ల భద్రత, వెజ్ బోర్డు, ప్రత్యేక రక్షణ చట్టాలు, పెన్షన్ పథకం, మీడియా అకాడమీ, మీడియా కమిషన్ వంటివి ఉన్నాయని వీటన్నింటిని ప్రభుత్వం పరిశీలించి వారి డిమాండ్లను నేరవేర్చాలని జాన్ వెస్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed