- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కలర్ ల్యాబ్ ఓనర్ సురేష్ హత్య కేసులో పురోగతి..?

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 11న నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరి ప్రాంతంలో గీతాంజలి కాంప్లెక్స్‌లో మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ (Manikantha Laser Color Lab)లో గద్దపాటి సురేష్‌ను దారుణంగా హత్య (murder) చేశారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి.. కస్టమర్ల వలె ల్యాబ్‌లోకి ప్రవేశించారు. వారు ఫోటో ఫ్రేమ్‌ల గురించి మాట్లాడుతూ సురేష్‌ను మాటల్లోకి దింపిన తర్వాత ఒక వ్యక్తి సురేష్ గుండెపై కత్తితో పొడిచాడు. దీంతో సురేష్ (Suresh) అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. అయితే ఈ కేసులో పోలీసులు పురోగతి (progress) సాధించినట్లు తెలుస్తోంది. సురేష్ హత్యకు తన తమ్ముడి విడాకులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం సురేష్ తమ్ముడు విడాకులు తీసుకొగా.. ఆ సమయంలో సురేష్ అంతు చూస్తామి తమ్ముడి భార్య బంధువులు (Brother's wife's relatives) బెదిరించారు. ఈ క్రమంలోనే సురేష్ ను తమ్ముడి మామ (Brother's uncle) హత్య చేయించారని ఆరోపణ ఉన్నాయి. ఈ కోణంలోనే పోలీసులు విచారణ ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం సురేష్ తమ్ముడు ఓ డాక్టర్ ను పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతుండటంతో విడాకులు తీసుకున్నారు. అయితే ఈ విడాకులకు సురేష్ కారణం అని, తన కుమార్తె జీవితం నాశనం కావడానికి సురేష్ యువతి తండ్రి కక్ష పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ గ్యాంగ్ (Gang) కు సుఫారి ఇచ్చి హత్య (Murder) చేయించినట్లు తెలుస్తోంది. కాగా ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా.. విచారణ పూర్తయిన తర్వాత వివరాలు తెలిసే అవకాశం ఉంది.