- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kunamneni : లగచర్ల దాడి ఘటనపై స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణపై వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం (Lagacharla Village) లగచర్లలో ప్రభుత్వం సోమవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. ఘటనపై (CPI) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) స్పందించారు. ఈ మేరకు ఆయన మంగళవారం సీపీఐ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. జనావళి ప్రాంతాల్లో ఫార్మా సిటీని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలని సూచించారు. లగచర్ల దాడి ఘటన దురదృష్టకరమన్నారు. కలెక్టర్, అధికారులపైన దాడి చేయడం సరైంది కాదన్నారు. తరచూ రాష్ట్రంలో ఏదో మూల ఘర్షణలు జరుగుతున్నాయని, దీనికి అసలు కారకులు ఎవరు ప్రభుత్వం సీరియస్‌గా ఎంక్వైరీ చేయాలని సూచించారు. బీఅర్ఎస్, బీజేపీ రాజకీయ కుట్ర ఎంతసేపు ప్రభుత్వం కూల్చాలని ఆలోచన తప్ప మరోటి లేదని కూనంనేని వ్యాఖ్యానించారు.
కులగణన సర్వేలో అడిగిన ప్రశ్నలకు అభ్యంతరాలు లేనప్పటికీ ప్రజల్లో ఏదో అపోహ దీన్ని ఆసరాగా చేసుకొని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ ఒకే దఫా 18,000 వేల కోట్లు చేశారు.. కానీ పూర్తి స్థాయిలో చేయాలని కోరారు. అసలు ప్రభుత్వం ఇప్పటి వరకు అప్పు ఎంత ఉంది.. మీరిచ్చిన హామీలకు ఎంతవరకు సాధ్యం అవుతాయి.. ప్రజలకు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.