జమిలి ఎన్నికలపై సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్

by GSrikanth |   ( Updated:2023-09-01 12:24:11.0  )
జమిలి ఎన్నికలపై సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌కు తాము వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. రాజ్యాంగం అక్కర్లేదు.. నా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే సరికాదని మోడీ తీరుపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ప్రక్రియ అయినా ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని అన్నారు. పేరు మోసిన పెద్దవాళ్లను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు.

జమిలి ఎన్నికలపై చర్చ జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారన్నారు. ఇండియా కూటమి బలపడకుండా ముందుగా తాము బయటపడాలని బీజేపీ చూస్తుందని ఆయన విమర్శించారు. దేశంలో దృష్టి మరల్చే రాజకీయాలు చేయడంలో మోడీ ఘనుడని విమర్శించారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అని లీక్ ఇచ్చారని అన్నారు. వన్ నేషన్, వన్ పార్టీ, వన్ పర్సన్ ..ఆర్ఎస్ఎస్ అన్నట్లుగా కేంద్ర వైఖరి ఉందన్నారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed