‘‘వేశ్యకు కూడా ఓ నీతి ఉంటుంది స్వామి..!’’ తాజా రాజకీయాలపై నారాయణ సెటైర్లు

by Satheesh |   ( Updated:2023-11-03 06:57:13.0  )
‘‘వేశ్యకు కూడా ఓ నీతి ఉంటుంది స్వామి..!’’ తాజా రాజకీయాలపై నారాయణ సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాజా రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. నిన్న నిచ్చితార్ధం అయ్యాక ఇంకో అందమైన అమ్మాయి/ అబ్బాయిగాని దొరికితే లేపుకపోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగవచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజా రాజకీయాల్లో కూడా ఇలా జరిగితే ఎలా? అని విమర్శించారు. వామపక్షాల పోత్తులు, సీట్ల విషయం కాంగ్రెస్ తేల్చడం లేదని ఇలా అసహనం వ్యక్తం చేశారని నెటిజన్లు అభిప్రాయ పడ్డారు. తాజాగా ఇవాళ కూడా మరో ట్వీట్ ఘాటుగా చేశారు. కన్యాశుల్కంలో మధురవాణి ఇలా చెబుతుందని, ‘వేశ్యకు కూడా ఒక నీతి ఉంటుంది స్వామి’ అంటూ పేర్కొన్నారు. మరి తాజా రాజకీయాల్లో అని నారాయణ ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed