కవితను వదిలేయాలంటే చేయాల్సింది ఇదే: సీపీఐ నారాయణ

by GSrikanth |
కవితను వదిలేయాలంటే చేయాల్సింది ఇదే: సీపీఐ నారాయణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారా? లేదా? అని ఉత్కంఠతో నిండిపోయిందన్నారు. నరేంద్ర మోడీకి మద్దతుగా మోడీ జిందాబాద్ అంటేనే కవితను విడుదల చేస్తారని, లేదంటే అరెస్టు చేసి జైలుకు పంపుతామని నారాయణ పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితను ఈడీ విచారణకు పిలిచారని వివరించారు. బీజేపీతో పోరాడాలి తప్ప నిరుత్సహ పడకూడదని సూచించారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆరోపించారు. బీజేపీలో చేరిన వారు స్వచ్ఛమైన వ్యక్తులుగా మారతారని నారాయణ పేర్కొన్నారు.

Advertisement

Next Story