400 సీట్లు వస్తాయని బీజేపీ ప్రచారం.. సీపీఐ నారాయణ సెటైర్లు

by GSrikanth |
400 సీట్లు వస్తాయని బీజేపీ ప్రచారం.. సీపీఐ నారాయణ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 400 సీట్లు వస్తాయని బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని విమర్శించారు. ఈసారి కేంద్రంలో బీజేపీ ఓడిపోతుంది.. ఏపీలో ప్రభుత్వం మారుతోంది.. ఇదే నిజం అని జోస్యం చెప్పారు. న్యాయవ్యవస్థ, తెలుగు ప్రజలను మాజీ సీజే వెంకటరమణ, వెంకయ్యనాయుడు నాశనం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం 97 శాతం రాజకీయాలు డబ్బుతో నడుస్తున్నాయని అన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే ఏపీలో అల్లర్లు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ ఊహించుకుంటున్న దానికి.. బయట వాస్తవ పరిస్థితికి అసలు పొంతనే లేదని అన్నారు. వాస్తవ పరిస్థితులు బీజేపీ అనుకుంటున్న దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయని అన్నారు. ఉత్తర భారతదేశంలోనూ ఎన్డీఏ కూటమికి భారీగా సీట్లు తగ్గనున్నాయని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే బలంగా గొంతు ఎత్తి మాట్లాడుతున్నారో వారిపై కక్షగట్టి కేసులు పెడుతున్నారని విమర్శించారు. లిక్కర్ కేసు కూడా బీజేపీ కుట్రలోంచి పుట్టిందే అన్నారు. మోడీ నియంతృప్తి పోకడలను వ్యతిరేకిస్తున్న కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా ఆయన కూతురు కవితను, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అందులో ఇరికించారని అన్నారు. మోడీ పతనం ప్రారంభమైందని.. బీజేపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు.

Advertisement

Next Story