- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగార్జున సాగర్ వివాదం కేసీఆర్, జగన్‌ల కుట్ర: CPI నారాయణ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు అహంభావాన్ని ఓడించి ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు పోరాటాలు చేసిన పటిమ ఉందని.. అందుకే ఎన్నికల్లో ప్రజలు అహంభావాన్ని సహించకుండా ప్రజలు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినందున ప్రజాస్వామ్యం గెలుస్తుంది అన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైఎస్ జగన్, కేసీఆర్ కుట్రపన్నారని.. అందులో భాగంగానే ఎన్నికల రోజు నాగార్జునసాగర్ నీటి విడుదల చేసే కుటీల ప్రయత్నం జరిగిందని.. ఇది జగన్ కేసీఆర్ ఆడిన నాటకం అని ఆయన విమర్శించారు.
ఖజానా కల్వకుంట్ల కుటుంబానికి నిండింది:
సీఎం కేసీఆర్ పదేపదే అభివృద్ధి పేరిట ప్రజలను ఓట్లు అడుగుతున్నారని.. అభివృద్ధి జరిగింది తెలంగాణ ప్రజలకు కాదని, కల్వకుంట్ల కుటుంబానికి ఖజానా నిండిదని అన్నారు. పదేళ్లు పరిపాలించిన కేసీఆర్ కనీసం నిరుద్యోగులకు పరీక్షలు నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శించారు. ధరణి పెద్ద కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధంగా పరిపాలన కొనసాగించడం వల్ల ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు. అవినీతి అహంభావం కవలలుగా కేసీఆర్ పరిపాలన కొనసాగిందన్నారు.
తమకున్న అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ ఓడిపోతున్నారని.. కొత్తగూడెం తమ అభ్యర్థిని సాంబశివరావు గెలుస్తున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా సిర్పూర్లో బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గెలవబోతున్నారని వీరిద్దరు.. అసెంబ్లీలో అడుగు పెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలబోతున్నారని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో పట్టణాల్లో కంటే గ్రామాల్లో ఓటింగ్ శాతం పెరిగిందని.. కేసీఆర్ అభివృద్ధి జరిగిందని చెబుతున్న హైదరాబాద్ సిటీలో ఓటింగ్ శాతం తక్కువ ఎందుకు జరిగిందని ఆయన ప్రశ్నించారు.