CPI తెలంగాణ సంచలన నిర్ణయం.. తెలంగాణలో పోటీచేసే స్థానాల ప్రకటన

by GSrikanth |
CPI తెలంగాణ సంచలన నిర్ణయం.. తెలంగాణలో పోటీచేసే స్థానాల ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ సీఎం నితీష్ కుమార్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఐదు స్థానాల్లో సీపీఐ పోటీ చేయబోతోందని నారాయణ సంచలన ప్రకటన చేశారు. అవకాశం ఇవ్వాలని ఇప్పటికే తమ మిత్రపక్షమైన కాంగ్రెస్‌ను కోరినట్లు వెల్లడించారు. అనంతరం బిహార్ రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఇండియా కూటమికి వ్యతిరేకంగా నితీష్ కుమార్ పనిచేస్తున్నారని అన్నారు.

ఈడీ, సీబీఐ కేసుల పేరుతో బీజేపీ ఎమ్మెల్యేలను భయపెడుతోందని కీలక ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇండియా కూటమిలోని పార్టీలను బీజేపీ భయాందోలనకు గురిచేస్తోందని మండిపడ్డారు. మతాల పేరుతో ఓట్లు రాబట్టుకోవాలని చూస్తోందని అన్నారు. ఇదిలా ఉండగా.. బిహార్‌లో కొత్త సర్కార్‌ కొలువుదీరింది. 9వ సారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం ఐదున్నరకు కొత్త కేబినెట్‌ తొలి భేటీ నిర్వహించనున్నారు.

Advertisement

Next Story