పొత్తులో భాగంగా మాకు రావాల్సిన 2 MLC లు వస్తాయి: సీపీఐ

by GSrikanth |
పొత్తులో భాగంగా మాకు రావాల్సిన 2 MLC లు వస్తాయి: సీపీఐ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలకపోవడంతో గత 48 గంటలుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లోనే ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసిందని వార్తలు రావడంతో పలువురు నేతలు రేవంత్ రెడ్డిని వచ్చి కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సీపీఐ నేతలు సైతం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి తదితర నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు తాజా రాజకీయ పరిస్థితులపై రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

కాగా, కాంగ్రెస్, సీపీఐ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ గెలిస్తే.. కొన్ని కీలక హామీలు సీపీఐ పార్టీకి ప్రకటించిన విషయం విదితమే. భేటీ అనంతరం సీపీఐ నేతలు మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహ్వానిస్తే ప్రభుత్వంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. పొత్తులో భాగంగా తమకు రావాల్సిన రెండు ఎమ్మెల్సీలు తమకు వస్తాయని దీమా వ్యక్తం చేశారు. కేబినెట్‌లోకి ఆహ్వానిస్తే ఆలోచిస్తామని అభిప్రాయపడ్డారు. సీపీఐ ప్రభావం ఉన్న ప్రతీచోట కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. కమ్యూనిస్టుల గొంతు అసెంబ్లీలో వినిపిస్తానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed