సిసోడియా సంగతి సరే.. అదానీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు: కూనంనేని

by GSrikanth |
సిసోడియా సంగతి సరే.. అదానీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు: కూనంనేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టును తాము ఖండించడం లేదని, తప్పుంటే ఎవరినైనా అరెస్టు చేయాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే సమయంలో ఆర్థిక కుంభకోణాలలో అతి పెద్ద కుంభకోణానికి పాల్పడి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసీని, అలాగే ఇతర సంస్థల ఆదాయాన్ని తన డొల్ల కంపెనీలకు మళ్ళించుకొని, వాటి నష్టానికి కారుకుడై ఆదానీని అరెస్టు చేయారా? అని ఆయన ప్రశ్నించారు. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్టు చేయడానికి సీపీఐ వ్యతిరేకం కాదు అని, రెండు ఛార్జ్ షీట్ పేరు లేకపోయినప్పటికీ, కేవలం సీబీఐ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పులేదనే సాకుతో సిసోడియాను అరెస్టు చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి స్పష్టమవుతోందన్నారు.

దేశంలో ప్రతిపక్ష పార్టీల నాయకులను మాత్రమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ ఆధీనంలో ఉండే సంస్థలతో అరెస్టు చేయిస్తోందని కూనంనేని మండిపడ్డారు. కేవలం ప్రతిపక్ష పార్టీల వారే తప్పు చేస్తున్నారా? పౌర హక్కుల కోసం కొట్లాడే వారు మాత్రమే తప్పు చేస్తున్నారా? బీజేపీలో ఒక్కరు కూడా తప్పులు చేయడం లేదా? వారేమైనా అతీతులా? అని ఆయన నిలదీశారు. దర్యాప్తు సంస్థలు ప్రతిపక్షాలను అరెస్టు చేయడం వరకే పరిమితమా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ప్రీతి ఆత్మహత్య కారకులను వదిలిపెట్టొద్దని, మహిళలను వేధించి హత్యలు, ఆత్మహత్యలను పురిగొల్పే సంస్కృతిని రూపుమాపాలని కూనంనేని తెలిపారు.

Advertisement

Next Story