సీఎం కేసీఆర్‌కు చాడ వెంకటరెడ్డి లేఖ

by Satheesh |   ( Updated:2023-05-27 13:46:51.0  )
సీఎం కేసీఆర్‌కు చాడ వెంకటరెడ్డి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ టూరిజం కార్పోరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. తెలంగాణ టూరిజం కార్పోరేషన్‌లో గత 20 సంవత్సరాలకు పై బడి చాలీచాలని వేతనాలతో రెగ్యూలర్ ఎంప్లాయిస్‌తో సమానంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. వారు గత కొన్ని సంవత్సరాల నుంచి క్రమబద్దీకరించాలని కోరుతున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత టూరిజం కార్పోరేషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్దీకరణ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ క్రమబద్దీకరణ చేపట్టకపోవడంతో ఉద్యోగులు నిరుత్సాహంతో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ టూరిజం కార్పోషన్‌లో 183 మంది కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగులను క్రమబద్దీకరించి, వారి వయోపరిమితిని పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా 61 సంవత్సరాలకు పెంచాలని లేఖలో పేర్కొన్నారు.

Also Read..

కేసీఆర్ వందల సార్లు తల నరుక్కోవాలి: సీఎంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

పోటాపోటీ వేడుకలు.. ఎన్నికల వేళ మూడు పార్టీల మధ్య పోటీ!

Advertisement

Next Story

Most Viewed