- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Atrocious: గోవులపై ఆగని దాష్టికం..
దిశ వెబ్ డెస్క్: గో సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా గో హింసను మాత్రం అడ్డుకోలేకపోతోంది. గోవుల కోసం గోశాలలు ఏర్పాటు చేసిన గోవులకు రక్షణ కల్పించలేక పోతున్నారు. నిత్యం ఎక్కడో చోట కిరాతకులు చేతిలో గోవులు ప్రాణాలను కోల్పోతూనే ఉన్నాయి. కొందరు దుర్మార్గుల దాష్టికానికి గోవులు బలైపోయిన ఘటనలు గతంలో కోకొల్లలు.
తాజాగా అల్లాంటి ఘటనే హైద్రాబాద్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. హైద్రాబాద్ లోని మన్సూరాబాద్ డివిజన్ జడ్జ్ కాలనీ లోని గోశాల లో దారుణం చోటు చేసుకుంది. కొందరు దుండగులు గోవులను ఎత్తుకెళ్లేందుకు గోశాలలో జొరబడ్డారు. ఆ తరువాత ఆ గోవులు అరవకుండా గోవులకు మత్తు మందు ఇచ్చారు. దీనితో ఆ మత్తుమందు డోస్ ఎక్కువ కావడం కారణంగా మూడు గోవులు మృతి చెందగా.. మరో రెండు గోవుల పరిస్థితి విషమంగా ఉంది.
అలానే మరో మూడు గోవులను దుండగులు ఎత్తుకెళ్లారు. కాగా ఈ ఘటనపై స్పందించిన కార్పొరేటర్ నరసింహ రెడ్డి దుండగుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ వారిపై కట్టిన చర్యలు తీసుకోవాలని కోరారు.