- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం జప్తునకు కోర్టు ఆదేశం
దిశ, ఆదిలాబాద్ బ్యూరో : మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలని మంచిర్యాల జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 40 ఏండ్లుగా ఓ మహిళ న్యాయ పోరాటం చేస్తున్నా పట్టించుకోకపోవడంతో ఈ తీర్పు వెలువరించింది. దీంతో జప్తు ఆపేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లాలోని కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివారులోని 478, 480 సర్వే నెంబర్లలోని అజ్మీరా బేగం అనే మహిళకు చెందిన 23 ఎకరాల 27 సెంట్ల భూమిని ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోర్టును ఆశ్రయించారు.
సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఈ విషయంలో అధికారులు నిర్లక్యం వహించారు. అధికారుల నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో కార్యాలయాలన్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశాల జారీ చేసింది. దీంతో జిల్లా అధికారులు నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారు. బాధిత మహిళతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు కలెక్టర్ ప్రయత్నం చేస్తున్నారు.