- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీహార్ జైల్లో కవిత మెడిటేషన్.. జపమాలకు కోర్టు అనుమతి
దిశ, వెబ్‌డెస్క్: కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. వచ్చే గురువారం రోజున మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా కోర్టులో కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కీలక వాదనలు వినిపించారు. కవితకు మధ్యంతర బెయిల్, రెగ్యూలర్ బెయిల్ ఇవ్వాలని కోరారు. ఎఫ్ఐఆర్‌లో కవిత పేరు లేకున్నా అరెస్ట్ చేశారని మరోసారి గుర్తుచేశారు. మొదటి, సప్లిమెంటరీ చార్జిషీట్‌లోనూ కవిత పేరు లేదని అన్నారు.
అసలు ఆమె విచారణకు సహకరిస్తున్నప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అరుణ్ పిళ్లై 9 సార్లు ఇచ్చిన వాంగ్మూలంలోనూ కవిత పేరును ప్రస్తావించలేదని తెలిపారు. అనంతరం ఈడీ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు సింఘ్వి కోర్టును సమయం అడిగారు. ఈ నెల 3వ తేదీన క్లియర్‌గా సమాధానం చెబుతానని అన్నారు. మరోవైపు తీహార్‌లో జైల్లో కవితను ఇంటి భోజనం అందించేందుకు కోర్టు మరోసారి అనుమతి ఇచ్చింది. ఇంటి భోజనంతో పాటు బుక్స్, పెన్నులు, పేపర్లు, మెడిటేషన్ చేసుకునేందుకు జపమాల, షూకు అనుమతి ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించారు.