Chitfund Fraud: 20 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం.. కోట్లతో ఉడాయించిన దంపతులు

by Rani Yarlagadda |
Chitfund Fraud: 20 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం.. కోట్లతో ఉడాయించిన దంపతులు
X

దిశ, వెబ్ డెస్క్: సైబర్ మోసాలే కాదు.. చిట్టీల మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నమ్మి చిట్టీలు వేస్తే.. నమ్మకంగా ఉంటూనే.. లక్షలు, కోట్లు దోచుకుని ఉడాయిస్తున్నారు కొందరు. పైగా.. మా ఇల్లు ఇదేగా.. మేం ఇక్కడే ఉంటాం.. ఎక్కడికీ పోము.. చిట్టీలు వేస్తే మీకే లాభం అని చెప్పి నమ్మించి మరీ.. నట్టేట ముంచేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ పరిధిలోని వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో చిట్టీల మోసం వెలుగుచూసింది.

అమరేందర్ యాదవ్, సబిత దంపతులు 20 ఏళ్ల క్రితం చిట్టీల వ్యాపారం ప్రారంభించారు. ఇటీవల చిట్టీపాట పాడుకున్నవారికి డబ్బులివ్వలేదు. ఎప్పుడిస్తారని అడిగితే.. ఇదిగో.. అదిగో.. అని చెప్పి చివరికి ఉడాయించారు. రూ.20 కోట్ల మేర చిట్టీల పేరుతో మోసం (Chitfund Fraud) చేసిన దంపతులిద్దరూ.. వారాసిగూడ పోలీస్ స్టేషన్లో (Warasiguda Police Station) ప్రత్యక్షమయ్యారు. దీంతో బాధితులు పీఎస్ కు చేరుకుని తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు.

Advertisement

Next Story