పత్తి కొనుగోళ్లు షురూ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-25 05:55:45.0  )
పత్తి కొనుగోళ్లు షురూ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ లో పత్తి కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే, ఎంపీలు కలిసి పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. సుమారు 11 కాంటాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ కు రూ.7521 ప్రకటించింది. అయితే.. 8శాతం తేమ ఉంటే క్వింటాల్ కు రూ.7,521 మద్దతు ధర లభిస్తుందని స్పష్టం చేసింది. సీసీఐతో పాటు ప్రైవేట్ వ్యాపారులు కూడా కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించేందుకు మల్టీ కంట్రోల్ కమిటీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్, వరంగల్ సహా జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు సాగుతున్నాయి.

మరోవైపు వరంగల్ ఏనామమాముల మార్కెట్ లో రైతుల పత్తి రేటు తగ్గడంపై నిరసన తెలిపారు. కాంటాలను రైతులు నిలిపివేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ గుజరాత్ తరహాలో క్వింటాల్ పత్తికికు రూ.8800 ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. విషయం తెలిసిందే. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ధర తక్కువగా ఉండడంతో కనీసం పెట్టుబడి రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుస వర్షాలు, చలికాలంతో పత్తిలో కనీసం తేమ 15 శాతం ఉంటుండటంతో మద్దతు ధర ప్రశ్నార్ధకమైంది. మద్ధతు ధరపై సీసీఐ చొరవ చూపాలని పత్తి రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed