Bhatti Vikramarka : రాష్ట్రంలోని ఐటీఐలను మారుస్తున్నట్లు డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

by Ramesh N |
Bhatti Vikramarka : రాష్ట్రంలోని ఐటీఐలను మారుస్తున్నట్లు డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో ఈ రాష్ట్రాన్ని పాలన చేసిన ఎవరూ కూడా ఆలోచన చేయని విధంగా నేడు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో మంత్రి మండలి మొత్తం ఆలోచన చేసిన నిర్ణయం ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో ఇవాళ నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీలో ఆయన మాట్లాడారు. మన రాష్ట్రం నుంచి సివిల్స్, టీజీపీఎస్సీ పరీక్షలు రాస్తూ రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేలా ఆర్థిక సాయాన్ని అందించాలని మొట్ట మొదటి సారిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక్కో విద్యార్థికి రూ. లక్ష రూపాయలు ఈ పరీక్షకు తయారు అవుతున్న వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది పెద్ద నగదు కాకపోయినప్పటికీ ఈ సహాయం ద్వారా కొంత ఉపశమనం కలిగించేదన్నారు. విద్యా వ్యాప్తి కోసం దీన్ని సింగరేణి ఆర్థిక సాయం చేసిందన్నారు. సివిల్స్ వారు దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న సొంత రాష్ట్రం బాగు కోసం నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ దేశ చరిత్రలో ఎవరూ కూడా ఆలోచన చేసి ఉండరని, పెద్ద ఎత్తున ఈ స్కూల్స్ మొట్ట మొదటి సారి మొదటి సంవత్సరంలోనే రూ. 5 వేల కోట్లతో నిధులు ఖర్చుపెట్టబోంతోందన్నారు. రాష్ట్రంలో గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్, ఇన్‌ఫ్రాస్టక్షర్ కోసం సంవత్సరానికి రూ.3 కోట్లు ఖర్చుపెట్టేదని, కానీ ఈ సంవత్సరం మేము రూ. 5 వేల కోట్లకు పెంచామని ఇది మా ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. విద్య కోసం అంగన్వాడి దగ్గర నుంచి మొదలు కొని ప్రణాళికలు తయారు చేశామని వెల్లడించారు. హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ పై ఫోకస్ పెట్టామన్నారు. మరోవైపు నేడు రాష్ట్రానికి 4వ సిటీ రాబోతుందని, ఆ ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఇండస్ట్రీలకు అనుగుణంగా సిలబస్‌ను తయారు చేసేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. స్కిల్ వర్సిటీలో చదివిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. దాదాపు రాష్ట్రంలోని 63 ఐటీఐలు కళాశాలలు మూసివేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఆ ఐటీఐలను అడ్వాన్స్ స్కిల్ సెంటర్‌లుగా భవిష్యత్తులో అప్‌గ్రేడ్ చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story