- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP MLA Palvai Harish : పులుల పేరుతో పోడు రైతులను గెంటేందుకు కుట్ర : బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్
దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి అదిలాబాద్(Adilabad)జిల్లాలో పులుల(Tigers) సంరక్షణ పేరుతో పోడు రైతుల(Podu Farmers)ను అధికారులు అడవుల నుంచి గెంటేందుకు కుట్ర చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్(BJP MLA Palvai Harish)ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది పులులు సంచరిస్తున్నాయని చెబుతున్న అధికారులు వాటి(Tigers Attacks) నుంచి ప్రజల రక్షణ(protection of the people)కు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే పులి బారిన పడి ఒకరు చనిపోగా, మరో వ్యక్తి చావు తప్పించుకున్నాడని, పశువులు పులుల బారిన పడి రైతులు నష్టపోయారన్నారు.
వరుసగా పులుల దాడులు జరుగుతుంటే అటవీ శాఖ తీసుకున్న చర్యలేవని ప్రశ్నించారు. ప్రభుత్వం పులుల నుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో ఫారెస్టు అధికారులు అసమర్థులుగా మారారని విమర్శించారు. పోడు రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.