- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పోటీ పరీక్షలు ఆపేందుకు ఆ పార్టీల కుట్ర’
దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్పీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలను ఆపేందుకు బీజేపీ, దాని బీ టీం పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. విపక్షాలకు నిరుద్యోగులు పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించడం ఇష్టం లేదని విమర్శించారు. పోటీపరీక్షలు జరిగితే యువత బీఆర్ఎస్ వైపు మళ్లుతారని విపక్షాలకు భయం పట్టుకుందన్నారు. అందుకే హైకోర్టులో ఈనెల 11న జరిగే గ్రూప్ పరీక్షలు నిలిపివేయాలని పిటిషన్ వేశారని తెలిపారు. హైకోర్టు సైతం పరీక్షలు నిర్వహించడానికి ఒప్పుకుందన్నారు. పరీక్షలు నిర్వహించాలన్నా హైకోర్టు వ్యాఖ్యలు విపక్షాలకు చెంపపెట్టని తెలిపారు. టీఎస్పీఎస్సీ కేసును సిట్ బృందం దర్యాప్తు చేస్తుందని కావాలనే విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. సికింద్రాబాద్‌లోని వైఎంసీలో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన క్రైస్తవ ఐక్య సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ప్రతి మతానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో క్రిస్టియన్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రిస్టియన్ యువత సేవారంగంలోనే కాకుండా రాజకీయాల్లో సైతం రాణించాలని సూచించారు. అందరూ కలిసి కట్టుగా ఉండాలని.. అలా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. దేశంలోనే ఐటీ కంపెనీలకు స్వర్గధామంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. మెట్రో నగరంగా ఉన్న హైదరాబాద్.. అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులకు ముందుకు వచ్చి బ్రాంచ్‌ల ఏర్పాటుకు క్యూ కట్టడంతో విశ్వనగరంగా రూపాంతరం చెందిందన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ ఐటీ ఉత్పత్తుల్లో రికార్డు స్థాయిలో 31.44 శాతం వృద్ది సాధించిందని వివరించారు. కేంద్రం ఎలాంటి సాయం అందించకున్నా ఐటీ రంగంలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. 2023 ఆర్ధిక సంవత్సరంలో దాదాపు 2.41 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులను తెలంగాణ చేసిందన్నారు.