- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వికలాంగుల ఫించన్ పెంపుపై టీ-కాంగ్రెస్ కీలక నిర్ణయం..?
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన వికలాంగుల ఫించన్ కంటే కాంగ్రెస్ ఎక్కువ ఇవ్వాలని భావిస్తున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రూ.4016 ను ప్రకటించగా.. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో రూ.6 వేలు ఇవ్వనున్నట్లు పొందుపరిచింది. దీంతో ఆ ఫించన్‌ను పెంచి మళ్లీ ప్రకటించాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. మేనిఫెస్టోలో పొందుపరిచేలా కసరత్తు చేస్తోన్నది. ఈ మేరకు ఏఐసీసీ, టీపీసీసీ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నది. దీనితో పాటు ప్రజలు, మేధావులు, విద్యావంతులు, నిరుద్యోగులు, వివిధ కుల సంఘాల నుంచి వచ్చిన ప్రపోజల్స్ పై కూడా మేనిఫెస్టో కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోన్నది.
హామీల సాధ్యసాధ్యలపై నిపుణులు, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్ల నుంచి సలహాలు, సూచనలను కాంగ్రెస్ పార్టీ సేకరిస్తున్నది. హామీలతో కూడిన ముసాయిదా టెంపరరీ కాపీ రెడీ కాగా.. హైకమాండ్ ఆదేశాల కొరకు రాష్ట్ర పార్టీ వెయిటింగ్ చేస్తోన్నది. గురు, శుక్రవారాల్లో థర్డ్ లిస్టు రిలీజ్ చేయాలని ఏఐసీసీ కసరత్తు చేస్తోన్నది. ఆ తర్వాత మేనిఫెస్టోను కూడా విడుదల చేయాలని రాష్ట్ర పార్టీ ప్రణాళికలు తయారు చేస్తున్నది.
ఫుల్ పబ్లిసిటీ .. శుక్రవారం ట్రైనింగ్..
పార్టీ ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు అతి త్వరలో ప్రకటించే మేనిఫెస్టోకు కూడా కాంగ్రెస్ ఫుల్ పబ్లిసిటీ ఇవ్వాలని భావిస్తున్నది. మేనిఫెస్టో బుక్ లెట్‌ను పార్టీ ప్రతి ఇంటికి చేర్చనున్నది. ఈ మేరకు మండలాల వారీగా స్పెషల్ టీమ్‌లను నియమించింది. ఈ టీమ్‌లకు శుక్రవారం గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్‌లో ఒక రోజు పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. మేనిఫెస్టోను ప్రజలకు ఎలా వివరించాలి..? ఓటర్లను ఆకట్టుకునేందుకు చేయాల్సిన కార్యకలపాలు, పొలింగ్ బూత్‌లలో వ్యవహరించాల్సిన తీరు, పార్టీ కి మైలేజీ వచ్చేలా చేసే పనులన్నింటిపై ముఖ్య లీడర్లు ప్రజేంటేషన్ ఇవ్వనున్నారు.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు వార్డు మెంబర్లకు వేతనాలు, రేషన్ షాపుల్లో సన్నబియ్యం, కల్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం, విద్యార్ధులకు వై ఫైవ్, స్విగ్గి, జూమాటో తదితర ఎంప్లాయిస్‌కు రాజస్థాన్ తరహాలో ఉద్యోగ భద్రత చట్టం, అన్ని కులాలకు కార్పొరేషన్లలను మేనిఫెస్టో కొరకు ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.