TG Assembly : ఫోటోలకు నో పాలిటిక్స్! కేటీఆర్‌తో ఫోటోలు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు

by Ramesh N |
TG Assembly : ఫోటోలకు నో పాలిటిక్స్! కేటీఆర్‌తో ఫోటోలు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. మరోవైపు విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో బీఆర్ఎస్‌పై ధ్వజమెత్తారు. అసెంబ్లీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు.

అయితే, అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న కేటీఆర్‌తో పలువురు అభిమానులు ఫోటోలు దిగారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు కూడా కేటీఆర్‌తో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఫోటోలకు నో పాలిటిక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, అసెంబ్లీలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా చర్చలు జరిగాయి.

Advertisement

Next Story