చీమలకే కాంగ్రెస్ టికెట్!..?

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-26 09:54:57.0  )
చీమలకే కాంగ్రెస్ టికెట్!..?
X

దిశా ఇల్లెందు: చీమల వెంట కార్యకర్తలు దండు కడుతున్నారు. ఇల్లందు నియోజకవర్గ మొత్తం ఆయనకే టికెట్ వస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా నియోజకవర్గంలో ముద్రపడి ఉన్నాడు. ప్రస్తుతం ఆయనకు దీటైన వ్యక్తి కాంగ్రెస్‌లో లేరనే ప్రచారం ఉంది. గతంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలు స్వచ్ఛందంగా నామినేషన్ విరమించుకోవాలని సూచిస్తే వెంటనే ఆమోదం తెలిపారు. ఆ కృతజ్ఞతతో ఈసారి కాంగ్రెస్ టికెట్ చీమలకే దక్కుతుందనే చర్చ సాగుతుంది.

కాంగ్రెస్ కంచుకోట

నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. 2014, 2018లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ప్రజలు ఇప్పటికీ కాంగ్రెస్‌కి జై కొడుతున్నారు. నియోజకవర్గాన్ని పరిశీలిస్తే కామేపల్లిలో కాంగ్రెస్‌కు తిరుగులేదు. గత ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు 9వేల మెజార్టీని అందించారు. మిగతా మండలాల్లో స్వల్ప ఆధిక్యం లభించింది. తదనంతరం కాంగ్రెస్ నుండి గెలిచిన హరిప్రియ టీఆర్ఎస్‌లకు చేరింది. అప్పటి నుండి కాంగ్రెస్ బాధ్యతలను చీమల వెంకటేశ్వర్లు స్వయంగా చూస్తున్నారు. కార్యకర్తల సమస్యలు ఆయనే పరిష్కరిస్తున్నారు. ఆయన గ్రామాలకు వెళ్లి స్వయంగా సమావేశాలు నిర్వహించి వివిధ పార్టీల కార్యకర్తలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నారు.

రేవంత్‌రెడ్డి‌తో సత్సంబంధాలు

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి‌తో చీమల వెంకటేశ్వర్లు సత్సంబంధాలు కలిగి ఉన్నారు. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నారు. నియోజకవర్గం నుంచి ఎటువంటి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్న చీమలకే రేవంత్ సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. దశాబ్ధాలుగా పార్టీని నమ్ముకున్నారు. ఎప్పటికప్పడు పార్టీ స్థితిగతులను రేవంత్‌కు వివరిస్తుండటం కలిసి వస్తుందిని భావిస్తు్న్నారు. తాను జెండా మోసిన కార్యకర్తనని ఇప్పుడు నాయకుడిని అయ్యాయని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇప్పటివరకు ప్రజల్లో ఉంటూ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. ఈ కృషి ఫలితంగా టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు రేవంత్ రెడ్డి నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చినట్లు ఆయన తెలిపారు.

మృదు స్వభావి

సాదాసీదాగా జనాల్లో తిరుగుతూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన మీద ఎటువంటి మచ్చ లేదు. మృదుస్వభావి కావడంతో నియోజకవర్గ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగేలా కృషి చేస్తున్నారు. గత ఎన్నికలలో చీమల కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా పోటీపడ్డాడు. అధిష్టానం చీమలను ఢిల్లీకి పిలవాల్సి వచ్చింది. ఈసారి తప్పుకోవాలని పార్టీ దిశా నిర్దేశం చేయడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. అప్పుడు ఇల్లెందు కాంగ్రెస్ అభ్యర్థిగా హరిప్రియ టికెట్ సాధించి విజయం సొంతం చేసుకుంది. కాగా ప్రస్తుతం హరిప్రియ టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. హరిప్రియ పార్టీ మారండంతో చీమలపై పార్టీకి సానుభూతి నెలకొంది. గత ఎన్నికలలో చీమలకు అన్యాయం జరిగిందని ఈసారి ఎలాగైనా గెలిపించుకుందామని కాంగ్రెస్ వర్గాలు అధిష్టానానికి సూచిస్తున్నాయి.

ఇల్లెందు నుంచి పోటీ చేస్తా.. చీమల వెంకటేశ్వర్లు

ఈ దఫా కాంగ్రెస్ తరపున ఇల్లెందు నియోజకవర్గం నుండి తానే పోటీ చేస్తాను. గత ఎన్నికలలో తనకు నష్టం జరిగిన విషయాన్ని పార్టీ గుర్తించింది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాను. రేవంత్ రెడ్డితో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ ఆశీస్సులు ఉన్నాయి.

Read more:

1.టీ-కాంగ్రెస్‌లో మరో అలజడి.. మర్రి శశిధర్ రెడ్డి బాటలో ఐదుగురు ముఖ్య నేతలు?

Advertisement

Next Story

Most Viewed