Congress Spokespersons: బీఆర్ఎస్ నేతలు మాట్లాడే అంశాలపై స్టడీ చేయాలి

by Mahesh |
Congress Spokespersons: బీఆర్ఎస్ నేతలు మాట్లాడే అంశాలపై స్టడీ చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు మాట్లాడే అంశాలపై సమగ్ర పరిశీలన తర్వాతనే కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కు ఆదేశాలిచ్చింది. బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు అతిగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని హైకమాండ్ సూచనలిచ్చింది. సబ్జెక్ట్ ను స్టడీ చేసి ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని వివరించింది. పవర్ పోయిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ను డ్యామేజ్ చేసేలా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటుందని, అలాంటి కామెంట్లకు సంపూర్ణమైన అధ్యయనం చేసి ఎదురుదాడి చేయాలని స్పష్టం చేసింది. సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకోవాలని టీపీసీసీ వెల్లడించింది .ఇక బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు చేసే విమర్శలకు, స్పష్టమైన ఆధారాలతో ప్రజలకు ముందుకు రావాలన్నారు. ఇందుకు బడ్జెట్ తో పాటు రుణమాఫీ, నిరుద్యోగం, స్కీమ్ లపై స్పోక్స్ పర్సన్ సమగ్ర వివరాలను రెడీ చేసుకోవాలని పీసీసీ పేర్కొన్నది. ప్రతిపక్షాలు చేసే వ్యాఖ్యలను పరిశీలిస్తూ ఉండాలని అధికార ప్రతినిధులకు పార్టీ సూచనలిచ్చింది.

Next Story

Most Viewed