- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో సంచలనం.. ''Phoenix'తోనూ కవితకు లింకులు'
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం పాలసీ తెలంగాణలో కాక రేపుతోంది. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని మద్యం పాలసీ, తెలంగాణ మద్యం పాలసీ ఒక్కటే అని ఆరోపించారు. అలాగే ఇవాళ హైదరాబాద్ లో ఐటీ దాడులు నిర్వహించిన ఫినిక్స్ కంపెనీ యజమాని కల్వకుంట్ల కుటుంబానికి బినామీ అని సంచలన ఆరోపణలు గుప్పించారు. ఓ వైపు మద్యం పాలసీలో కల్వకుంట్ల కవిత పేరు వినిపిస్తుండగా.. మరో వైపు ఫినిక్స్ సంస్థకు, కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
తెలంగాణ మద్యం పాలసీపై అనుమానాలు: భట్టి విక్రమార్క
ఢిల్లీలో ఉన్న మద్యం పాలసీ తెలంగాణలో ఉన్న మద్యం పాలసీ ఒకటే అని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఆరోపించారు. ఢిల్లీ అంశం చూస్తుంటే తెలంగాణలో ఇంకెంత స్కాం జరిగిందోననే అనుమానాలు వస్తున్నాయన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్నవారందరిని సీబీఐ విచారణ చేయాలన్నారు. గాంధీ పాలసీని వల్లె వేస్తున్న వారు అనుసరిస్తున్న లిక్కర్ పాలసీ విధానం చూస్తుంటే ఆశ్చర్యం వేయకమానదని భట్టి విస్మయం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ ఆదాయం సంవత్సరానికి కేవలం రూ.10 వేల కోట్ల లోపే ఉండేదని, అదే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక చిన్న రాష్ట్రమైన తెలంగాణలో లిక్కర్ ఆదాయం ఏడాదికి 30 వేల కోట్లకు చేరిందని అన్నారు. రాష్ట్ర విభజనకు మందు క్వార్టర్ బాటిల్ ధర రు.30 ఉండేదని, ఇప్పుడు రూ.200 కు చేరిందన్నారు. ఈ డబ్బు అంతా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ జరిగిందని గగ్గోలు చేస్తున్న బీజేపీ.. తెలంగాణలో సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధాలు ఉన్న అన్ని రాష్ట్రాలు, అందరు వ్యక్తులపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
ఈ 8 ఏళ్లలో రూ.300 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?: మధు యాష్కీ గౌడ్
లిక్కర్ దందాలో కవిత పేరు బయటకు రాగానే టీఆర్ఎస్ నాయకులు ఉలిక్కి పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ విమర్శలు చేశారు. లిక్కర్ దందా నుంచి చీకోటి క్యాసినో దందా వరకూ టీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందని.. బాహుబలి మొదటి పార్ట్ బ్లాక్ మనీలో కేటీఆర్, కవితకు వాటాలున్నట్లు వార్తలు వచ్చాయని, ఇసుక దందాలో కేటీఆర్ పాత్ర అందరికీ తెలుసని అన్నారు. త్రిబుల్ బెడ్ రూమ్ లో ఉండే కవితకు ఈ ఎనిమిదేండ్లలో రూ. 300 కోట్ల విలువచేసే భవనాలు ఎట్లావచ్చాయి? బెంగళూరు డాలర్స్ కాలనీ భవంతులు ఎలా వచ్చాయి? వందల కోట్ల ఆస్తులు ఎక్కడివి అని ప్రశ్నించారు. కవిత ముడుపులు తీసుకోవడంలో సిద్దహస్తురాలని ఆరోపించారు. కవితకు దుబాయిలో, అమెరికాలో దందాలున్నట్లు గతంలో విన్నామని, ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో లిక్కర్ దందా గురించి చూస్తున్నామన్నారు. ఫినిక్స్ సంస్థ గతంలో కవిత జాగృతికి రూ.5 లక్షల చెక్కులు ఇచ్చిందని, ఫీనిక్స్ సంస్థలో కవితమ్మ లావాదేవీలు ఉన్నాయన్నారు. ముదనష్టపు చంద్రశేఖర్ రావు పాలనలో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు చివరకు పోలీసు ఇన్ స్పెక్టర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎక్కడ చీకటి దందాలు జరిగినా అందులో కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పాత్ర వెలుగులోకి వస్తుందన్నారు. బయట ప్రపంచానికి చెట్లు నాటుతున్నట్లు కనిపిస్తున్న చెట్ల సంతోష్.. ఆల్కాహాల్ సంస్థలతో కలిసి చిన్నపిల్లలకు ఇష్టమున్న రీతిలో బీర్లు, వైన్లు తాగిపిస్తున్నాడని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలకు ఫినిక్స్ సంస్థలో వాటాలు ఉన్నాయన్నారు.
తెలంగాణ నేతలే ఢిల్లీ మద్యం స్కామ్ కు ఆధ్యులు: జీవన్ రెడ్డి
తెలంగాణలో కొనసాగుతున్న అక్రమ మద్యం వ్యాపారాలపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ చర్యలు తీసుకోని పక్షంలో అది డీజీపీ అసమర్థతగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ నేతలే ఢిల్లీ మద్యం స్కామ్ కు ఆద్యులు అని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే నాలుగు రెట్లు మద్యం రేట్లు ఎక్కువగా ఉందని, దీని బట్టి చూస్తే తెలంగాణ మద్యం అమ్మకాల్లో ఎంత స్కామ్ జరిగి ఉంటుందో అని అనుమానం వ్యక్తం చేశారు.
చుక్కపల్లి సురేష్ కల్వకుంట్ల బినామీ: ఉత్తమ్
పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన ఫినిక్స్ కంపెనీ యజమాని చుక్కపల్లి సురేష్ కు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులతో సంబంధాలు ఉన్నాయని టీ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చుక్కపల్లి సురేష్ కల్వకుంట్ల కుటుంబానికి బినామీ అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో హుజూర్ నగర్ బై ఎలక్షన్ సమయంలో అక్కడ ఉన్న సిమెంట్ కంపెనీలకు ఫోన్ చేసి టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని బెదిరించారని ఉత్తమ్ ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబానికి చుక్కపల్లి సురేష్ కు ఉన్న సంబంధాలపై తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, కేంద్ర దర్యాప్తు సంస్థకు ఆ వివరాలు అందజేస్తాన్నారు.
మంగళవారం కంపెనీకి చెందిన 10 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు జరిగాయి. పలుచోట్ల వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్ ఫ్రాలో పెట్టుబడులు పెట్టిన ఫీనిక్స్ సంస్థ చైర్మెన్, డైరెక్టర్ల నివాసాల్లోనూ ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సంస్థపై ఐటీ సోదాలు నిర్వహించడం వెనుక టార్గెట్ కేటీఆర్ అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. మంత్రి కేటీఆర్ కు చుక్కపల్లి సురేష్ కు అత్యంత దగ్గరి సంబంధం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఓ వైపు మద్యం స్కామ్ లో కూతురు కవిత పేరు వినిపిస్తుండగా.. మరో వైపు ఫినిక్స్ సంస్థలో కేసీఆర్ కుటుంబానికి వాటాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. వరుస పరిణామాలతో కేసీఆర్ కు షాక్ తప్పదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.