విద్యుత్ కోతలపై ప్లకార్డులతో కాంగ్రెస్ నిరసన

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-09 09:36:26.0  )
విద్యుత్ కోతలపై ప్లకార్డులతో కాంగ్రెస్ నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో : అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ వాక్‌అవుట్ చేసింది. గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని విద్యుత్ కోతలపై కాంగ్రెస్ నిరసనకు దిగింది. శాసనసభలో వాయిదా తీర్మాణం ప్రవేశపెట్టింది. అయితే, కాంగ్రెస్ నేతలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరస్కరించడంతో కాంగ్రెస్ ఆందోళణ వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నేతలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో సభలోపల వెలుపల ప్లకార్డులతో నిరసన తెలిపుతూ అసెంబ్లీ నుంచి వాక్ అవుట్ చేశారు.

అసెంబ్లీ ముందు ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీ బయట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి మాట్లాడుతూ...రాష్ర్టంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా నష్టాలు, ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం ఢంభికాలు చెబుతున్నా..కనీసం నాలుగైదు గంటలు కూడ కరెంట్ ఇవ్వడం లేదన్నారు. ఇచ్చేటువంటి నాలుగైదు గంటల కరెంట్ కూడ ఎప్పుడు ఇస్తున్నారో.. ఏసమయానికి ఇస్తున్నారో చెప్పలేని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్నారు.

రైతుల సమస్యల గురించి మాట్లాడాటానికి సమయం ఇవ్వాలని సభలో సభాపతికి వినపడేలా పదేపదే గొంతుపోయేట్టుగా అరిచి, గీ పెట్టినా పట్టించుకోవడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. విద్యుత్ కోతలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయరంగాన్ని కాపాడాలని సీఎల్పీ పక్షాన రైతుల ఇబ్బందులపై సభలో చర్చించడానికి అవకాశం ఇవ్వాలని అడ్జెట్మెంట్ మోషన్ ఇవ్వడం జరిగిందన్నారు. పెద్ద ఎత్తున గొంతు పోయేటట్టుగా అరిచిన కానీ, వైఖరిని కానీ, మా కెళ్లి చూడటం గానీ చేయకుండ అడ్జెట్మెంట్ మోషన్ ను తిరస్కరించినందుకు చాలా బాధాతో.. ఆవేధనతో సభలో నిరసన వ్యక్తం చేసి బయటకు వచ్చామని తెలిపారు.

సభలో ప్రజా సమస్యలు, రైతులు పడుతున్న ఇబ్బందులు చర్చించడానికి ముందుకు రాని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ అంతరాయం లేకుండా 24గంటల పాటు నిరవధికంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కోతలపై సభలో చర్చ జరగాలని ప్రజల తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు క్రాప్ సీజన్‌లో మాటిమాటికి కరెంటు పోతుందని ఆరోపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క నాణ్యమైన కరెంటు సరఫరా చేసి రైతులను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజలపై రూ. 16వేల కోట్ల భారం మోపాలని ప్రభుత్వం చూస్తోందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed