- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana budget 2023: బడ్జెట్‌పై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌లో భారీ అంకెలు ఉన్నాయే తప్ప గత బడ్జెట్ లెక్కలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ ప్రభుత్వ హామీల లెక్కలు బడ్జెట్‌లో చూపించడం లేదని విమర్శించారు. లిక్కర్ ఆదాయం బడ్జెట్‌లో బాగా కనిపించిందన్న ఆయన.. ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంపై క్లారిటీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కలల బడ్జెట్ మాత్రమేనని వాస్తవ బడ్జెట్ కాదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌తో బలహీన వర్గాలకు ఒరిగిందేమి లేదన్నారు. 8 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, గిరిజన బంధు ఎమయ్యాయని నిలదీశారు. ఎవరో అధికారులు రాసిస్తే దాన్ని హరీష్ రావు చదివి వినిపించారని ఆరోపించారు.
Read More..
Telangana budget 2023 :సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు